![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -134 లో... సీతాకాంత్ కి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చినందుకు అందరు విష్ చేస్తారు. ఈ శుభ సందర్బంగా నాకు ఈ అటెండర్ పోస్ట్ కాకుండా కొంచెం హై లెవెల్ పోస్ట్ ఇప్పించమని మాణిక్యం అనగానే ప్రమోషన్ ఏగా ఇస్తాను. నువు సీనియర్ గా వర్క్ చేస్తున్నావని అందరితో చెప్పించమని సీతాకాంత్ అంటాడు. దానికంటే టూ ఇయర్స్ అగ్రిమెంట్ బెటర్ అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సందీప్ కి మల్లేశ్ ఫోన్ చేసి.. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే మీ అన్నయ్యకి నిజం చెప్తానని బెదిరిస్తాడు.
అప్పుడే సేట్ రామలక్ష్మి అంటూ ఇంటికి వస్తాడు. రామలక్ష్మి తన అత్తయ్య నగలు తీసుకొని వచ్చి వీటికి మెరుగు పెట్టించి తీసుకొనిరా అని తనకి ఇస్తుంది. అదంతా చూస్తున్న సందీప్.. ఆ నగలు అమ్మి మల్లేశ్ అప్పు తీర్చాలనుకుంటాడు. ఎలాగూ బంగారం లాకర్ కీస్ రామలక్ష్మి దగ్గరే కాబట్టి తననే అంటారని సందీప్ అనుకుంటాడు. అప్పుడే పెద్దాయన హ్యాపీగా ఇంటికి వచ్చి.. రామలక్ష్మిని పిలుస్తాడు. ఏమైందని రామలక్ష్మి అడుగగా
. నీ భర్తకి బెస్ట్ బిజినెస్ మ్యన్ అవార్డు వచ్చిందని చెప్తాడు. రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా నీ వల్లే అని పెద్దాయన అనగానే.. బావగారు కష్టపడితే వచ్చింది.. నువ్వు ఇవ్వమంటే అవార్డు ఇవ్వలేదు.. తెగ పొంగిపోకని శ్రీవల్లి అంటుంది. ఆయన ఎవరు పేరు చెప్పినా నేను ఒకే అంటానని రామలక్ష్మి అనగానే.. బావగారు అత్తయ్య గారి పేరు చెప్తారని శ్రీవల్లి అంటుంది. తాతయ్య అయనకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండని పెద్దాయనకి చెప్తుంది రామలక్ష్మి.
మరొకవైపు ధన బిజినెస్ ప్లానింగ్ చూసిన సీతాకాంత్.. పర్ ఫెక్ట్ లేదు ఇంకొకటి ట్రై చెయ్ అని ధనకి సీతాకాంత్ చెప్తాడు. మీకు నచ్చదు నేను ఇంకొకటి చేసిన ఇలాగే అంటారని ధన చిరాకుపడతాడు. ధనకి సీతాకాంత్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తను వినకపోవడం తో సీతాకంత్ తనపై సీరియస్ అవుతాడు. అది విని మాణిక్యం ఏమైందని ధనని అడుగగా... ధన విషయం చెప్పగానే ఎవరైనా అలా చిరాకు పడతారా అని ధనకి చెప్తాడు. ఆ తర్వాత పెద్దాయన సీతాకాంత్ కి ఫోన్ చేసి.. రామలక్ష్మి అనగానే ఫోన్ స్విచాఫ్ అవుతుంది. దాంతో రామలక్ష్మికి ఏమైందంటూ సీతాకాంత్ కంగారుగా ఇంటికి వస్తాడు. అందరు తనకి కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ తినిపిస్తారు. అత్తాకోడళ్ళు చిన్న పందెం వేసుకున్నారని నేను ఫోన్ లో చెప్పబోతుంటే ఫోన్ స్విచాఫ్ అయిందని సీతాకాంత్ తో పెద్దాయన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |